DNB News - ఆంధ్రప్రదేశ్ / : నీటి సంరక్షణ మరియు సాగు నీటి సమర్థ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసిగి మండలంలోని కొలమానపేట మరియు దుద్ది గ్రామాల్లో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శ్రీ టిప్పు సుల్తాన్ చేత ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి వనరులను సంరక్షించడం ప్రతి రైతు, ప్రతి సాగు నీటి సంఘం బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా నీటి వినియోగం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండల నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, ముత్తురెడ్డి, అయ్యన్న, నరసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇరిగేషన్ టీబీపీ సబ్ డివిజన్ నెంబర్-2 డీఈఈ ఎం. నారాయణ, ఏఈ రవి ప్రసాద్, ఎంఏఓ వరప్రసాద్, ఎంపీడీఓ కోసిగి మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ద్వారా రైతులకు నీటి వినియోగంపై పలు సూచనలు ఇవ్వబడగా, సాగు నీటి సంఘాల బాధ్యతలను వివరించారు.
Admin
DNB News