DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలో చేపడుతున్న డబుల్ రైల్వే ట్రాక్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ఈద్గా వద్ద డబుల్ ట్రాక్ పరిసర ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్‌లు, కల్వర్టులు, డ్రైనేజీ కాలువల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ మున్సిపల్, ఆర్ & బి, జలవనరుల, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టాలని సూచించారు. డబుల్ ట్రాక్ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాట్లను మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షించాలని తెలిపారు. అదేవిధంగా ఈద్గా వద్ద రైల్వే ట్రాక్ పక్కన నుంచి ఇందిరమ్మ కట్ట మీదుగా చెన్నమ్మ సర్కిల్ సమీపంలోని జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రతిపాదనలను కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీఈ కృష్ణలత, రైల్వే, ఆర్ & బి శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News