Saturday, 01 August 2026 10:05:06 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రూ.10 లక్షల విలువైన 12 దొంగతనపు బైక్‌లు స్వాధీనం – నిందితుడి అరెస్ట్...

Date : 30 May 2026 11:17 AM Views : 93

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా దొంగిలించిన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా బైక్‌పై వస్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు గతంలో ఆదోని వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఆదోని తాలూకా, పత్తికొండ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదోని – ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని సి.ఐ రాజశేఖర్ రెడ్డి అభినందించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :