Wednesday, 16 September 2026 01:44:23 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై ఎంహెచ్‌పీఎస్ ఆగ్రహం..

Date : 11 March 2026 02:51 PM Views : 117

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి నిర్లక్ష్యం చూపుతున్నారని సమితి ఆరోపించింది. మహిళా శిశు ఆసుపత్రిలో సోమవారం వందలాది గర్భిణీలు స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి రావడం తీవ్ర ఆందోళన కలిగించిందని తెలిపింది. ఆసుపత్రిలో రద్దీ అధికంగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ పరిస్థితి చూస్తే పేదలుగా పుట్టడమే వారి పాపమా అన్న భావన కలుగుతోందని నూర్ అహ్మద్ విమర్శించింది. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు పూర్తయినా ఆదోని నియోజకవర్గంలో ప్రజలకు సరైన అభివృద్ధి కనిపించడం లేదని సమితి అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో మాత్రమే కార్యకలాపాలు పరిమితమైపోయాయని, పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. అసెంబ్లీలో వంద శాతం హాజరు ఉన్నప్పటికీ ఆదోని పట్టణంలో మాత్రం ప్రజల మధ్య తక్కువగా కనిపిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆదోని నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సమితి డిమాండ్ చేసింది. లేకపోతే ఎమ్మెల్యే నిర్లక్ష్య పాలనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: