DNB News - ఆంధ్రప్రదేశ్ / : కొత్తూరు గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. పెసల బండ వాటర్ స్కీం ద్వారా గత పది రోజులుగా త్రాగునీరు సరఫరా కావడం లేదని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కర్ణ, పార్టీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి కొరత మరింత పెరుగుతున్న సమయంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే గ్రామానికి త్రాగునీరు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే గ్రామస్తులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Admin
DNB News