Saturday, 01 August 2026 06:37:47 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం..

Date : 28 April 2026 10:11 AM Views : 92

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ శివారు మండగిరి ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 630/Aలో రస్తా పొరంబోకు భూమిగా గుర్తించిన స్థలంపై తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సుమారు 15 రోజుల క్రితం ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి సంబంధిత అధికారులతో కలిసి ఆ భూమిపై హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్పష్టం చేశారు. అయితే, ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఆ హెచ్చరిక బోర్డును ధ్వంసం చేయడం సంచలనానికి దారి తీసింది. ఈ ఘటనతో ప్రభుత్వ భూముల రక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, అక్రమార్కులతో లోపాయికార ఒప్పందాలు కుదిరాయన్న ఆరోపణలు వినిపిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూములను రక్షిస్తున్నామని చెబుతుండగా, మరోవైపు డీల్ రాజకీయాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? బోర్డు ధ్వంసానికి బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలు ప్రజల్లో నెలకొన్నాయి. వెంటనే ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిజాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: