Saturday, 01 August 2026 10:03:59 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: ABVP డిమాండ్..

Date : 11 May 2026 03:52 PM Views : 49

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో పెండింగులో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులపై పడుతున్న ఆర్థిక ఒత్తిడిని తొలగించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆదోని శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.5,800 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వకపోవడం, డిగ్రీలు పూర్తి చేసిన సుమారు 7 లక్షల మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందలేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన G.O.Rt.No.123, Higher Education Department, తేదీ 15-07-2024 ప్రకారం ఫీజులు చెల్లించకపోయినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, చాలా కళాశాలలు ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా G.O.Ms.No.72, Social Welfare Department, తేదీ 05-10-2014 ప్రకారం ప్రతి త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లోపు ఫీజులు విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని ఉన్నప్పటికీ, ప్రభుత్వం సమయానికి చెల్లింపులు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్న బకాయిలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఫీజు రీయంబర్స్మెంట్ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం రెండు విడతల్లో రూ.1,988 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగులో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవిందరాజ్, టౌన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు స్రవంత్ కుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: