DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హెబ్బటం నుండి కురుకుంద గ్రామాల వరకు త్రాగునీటి పైపు లైన్ ఏర్పాటు కోసం రూ.59 లక్షల గ్రాంట్‌ను మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంబంధిత గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పైపు లైన్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను అభ్యర్థించారు.
Admin
DNB News