Tuesday, 04 August 2026 02:35:18 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడిపై చర్యలు తీసుకోవాలి – ఏఐఎస్ఎఫ్ డిమాండ్.

Date : 13 April 2026 06:26 PM Views : 94

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సోమన్న, ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష మాట్లాడుతూ, జిల్లాలోని అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నాయని తెలిపారు. నగరంలో భారీ ఫ్లెక్సీలు, ప్రకటనల ద్వారా ఆకర్షణీయ ప్రచారాలు నిర్వహిస్తూ, ఇంటింటికి వెళ్లి అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పర్యవేక్షణ లోపమే ఈ దోపిడికి కారణమని అన్నారు. వెంటనే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డిమాండ్లు: ముందస్తు అడ్మిషన్లను తక్షణమే నిలిపివేయాలి గుర్తింపు లేని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి అక్రమ ఫీజు వసూళ్లను పూర్తిగా అరికట్టాలి బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి సి. అశోక్, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: