Monday, 02 November 2026 10:08:57 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

గర్భిణీలను ప్రైవేట్ నర్సింగ్ హోంలకు పంపితే కఠిన చర్యలు: ఎమ్మెల్యే పార్థసారథి హెచ్చరిక..

Date : 13 March 2026 09:32 AM Views : 191

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వ మాతా–శిశు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలను ప్రైవేట్ నర్సింగ్ హోంలకు పంపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హెచ్చరించారు. గురువారం ఆదోని ఎంసీహెచ్ (మాతా శిశు) ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ (HDC) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునీకరణ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, వైద్య సేవల మెరుగుదలపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించేందుకు వైద్యుల లభ్యత, మందుల సరఫరా, ఆసుపత్రి పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. అవసరమైన సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం తో మాట్లాడి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, కమిటీ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :