Friday, 18 September 2026 08:20:12 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

లైసెన్స్ రెన్యూవల్‌కు లంచం.. ఏసీబీ వలలో ఏఈవో..

Date : 15 May 2026 11:55 AM Views : 94

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏఈవో నర్సింహులు, ప్రైవేటు వ్యక్తి మోహన్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని ఈడిగ రంగన్న ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణ లైసెన్స్ రెన్యూవల్‌తో పాటు విత్తనాల విక్రయాల అనుమతి కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అనుమతులు మంజూరు చేయడానికి ఏఈవో నర్సింహులు రూ.35 వేల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలు నమోదు చేసిన అధికారులు బుధవారం సాయంత్రం ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు ఏఈవో నర్సింహులు, ప్రైవేటు వ్యక్తి మోహన్‌కు రూ.30 వేల లంచం అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనంగా మోహన్ వద్ద రూ.73 వేల అనధికార నగదు కూడా గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐ రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :