Saturday, 01 August 2026 10:36:56 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆదోనిలో ఎండల తీవ్రత – ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని SFI వినతి..

Date : 10 April 2026 09:41 AM Views : 86

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శులు సంజయ్, శశిధర్, అలాగే DYFI పట్టణ అధ్యక్షుడు మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఆదోని పట్టణంలో తీవ్రమైన ఎండలు నమోదవుతున్నాయని, రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండ తీవ్రత వల్ల సన్‌స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్‌తో రూఫ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్నూలు నగరంలో ఇలాంటి ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఎండల కారణంగా ప్రజలు, ప్రయాణికులు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, బస్టాప్‌లు మరియు రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చాలని మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని SFI నాయకులు కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :