Thursday, 05 November 2026 05:36:46 AM
# ఆదోనిలో స్వప్న నాయకర్ సంచలన విజయం.. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు షాక్.. # చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన కేసులో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!! # దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!!

మాజీ మంత్రి ముద్రగడను మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ స్పీకర్ తమ్మినేని

Date : 13 February 2026 05:35 PM Views : 238

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయ చర్యల నేపథ్యంలో సెంట్రల్ జైల్ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ను పరామర్శించేందుకు రాజమండ్రికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రజానేత ముద్రగడ పద్మనాభం ఆహ్వానం మేరకు తమ్మినేని సీతారాం ఆయన నివాసానికి విచ్చేశారు. అక్కడ ముద్రగడ ప్రత్యేకంగా అల్పాహారం ఏర్పాటు చేసి సాదరంగా ఆతిథ్యం అందించారు. సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొన్న హుందాతనం, విలువలతో కూడిన ప్రజాసేవ, అప్పటి రాజకీయ నైతికత వంటి అంశాలను ఈ సందర్భంగా ఇరువురు సీనియర్ నేతలు స్మరించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే రాజకీయాల లక్ష్యంగా ఉండేదని, వ్యక్తిగత విద్వేషాలు, ప్రతీకార భావాలు అప్పటి రాజకీయాల్లో అరుదుగా కనిపించేవని వారు గుర్తుచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పెరుగుతున్న పగలు, ప్రతీకార చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అధికారంలో ఉన్న పార్టీలు ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలకాలని, ప్రజా సంక్షేమం ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని ఈ ఇద్దరు సీనియర్ నేతలు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని తో పాటు రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు, రాష్ట్ర ఇంటలెక్చువల్ కార్యదర్శి పిల్లల రామకృష్ణ హెచ్చర్ల జడ్పీటీసీ సనపల నారాయణరావు కొత్తూరు మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :