Monday, 03 August 2026 09:25:20 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అరేకల్ గురుకులంలో బాల్యవివాహాలు, మహిళా రక్షణపై అవగాహన – డీఎస్పీ హేమాలత..

Date : 23 February 2026 11:54 AM Views : 104

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలంలోని అరేకల్ గురుకులంలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్యవివాహాల నివారణ, మహిళల రక్షణ, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని డీఎస్పీ హేమాలత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, అటువంటి సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థినులు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శక్తి యాప్ వినియోగం, అత్యవసర సేవల కోసం డయల్ 112, పిల్లల సహాయానికి 1098, సైబర్ మోసాలపై ఫిర్యాదుల కోసం 1930 నంబర్ల గురించి వివరించారు. రహదారి భద్రతలో భాగంగా బైకు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు ఇవ్వవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ మంజుల, శక్తి టీం సిబ్బంది మహిళా పోలీస్ కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టేబుల్ నాగరాజ్, మల్లప్ప, బాల భాస్కర్, తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంకటేష్, భూ చంద్ర కాసిలింగతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల రక్షణ, బాల్యవివాహాల నివారణలో సమాజం మొత్తం సహకరించాలని డీఎస్పీ హేమాలత కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :