Monday, 03 August 2026 01:11:00 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రాష్ట్రంలో తిరోగమనంలో విధ్యా రంగం

Date : 04 April 2026 11:58 AM Views : 139

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అముదాలవలస, ఏప్రిల్ 3: నారా లోకేష్ కు తన శాఖ పట్ల కనీస అవగాహన లేని వ్యక్తి ని ముఖ్యమంత్రి చేయాలనుకోవడం, ప్రజలు హాస్యంగా భావిస్తున్నారన్నారు వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు.శుక్రవారం తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత వైసిపి హయాంలో ప్రభుత్వ బడులు గణనీయమైన పురోగతి సాధించి, దేశంలోనే అక్షరాస్యత పరంగా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వ బడులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి, పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి, ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగేలా చేసిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ తిరుగమనంగా ఉండటం బాధాకరం అన్నారు.గత ప్రభుత్వ జగన్ మోహనరెడ్డి హయాంలో ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ తదితర సిలబస్ లను ప్రవేశ పెట్టి విద్యను పేదవాడికి అందుబాటులోకి తెస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వo అవన్నీ తొలగించి విద్యను పేదవాడికి దూరం చేసింది అని ఎద్దేవ చేశారు ఇటీవల పార్లమెంటులో కేంద్ర మానవ వనరుల మంత్రి చేసిన ప్రకటన ఇందుకు మచ్చుతునక అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రవేశాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందన్నారు. ఇది ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేసి, ప్రైవేట్ బడులకు పెద్ద పేట వేసే కుట్రపూరితమైన చర్యగా పేర్కొన్న చిరంజీవి నాగ్, ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో అటు రాష్ట్రం లోనూ,ఇటు జిల్లాలోనూ దోపిడీ రాజ్యం కొనసాగుతుందని వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ ఎద్దేవా చేశారు.అమరావతి రాజధాని పేరుతో రెండవ విడత భూసేకరణ పేరుతో అక్కడ తండ్రి కొడుకులు భూదందాకు సిద్దపడితే, జిల్లాలోని మూలపేట పోర్టు పేరుతో 15 వేల ఎకరాల భూముల సేకరణ పేరుతో బాబాయ్ -అబ్బాయి లు డ్రామాలకు తెరలేపారని అయన విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యాగారానికి గిన్నెగా ఉంటూ,దేశానికి ఆహార ధాన్యాలు ఎగుమతులు చేసిన ప్రాంతంగా ఉన్న అమరావతిని రాజధాని పేరుతో ధ్వంసం చేయటం తగదన్నారు.మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధానిగా ఏర్పాటు చేయడం వలన ఎవరికి ఎటువంటి నష్టం ఉండదన్నారు. ఇదే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అన్నారు.అమరావతి రాజధాని ప్రాంతంగా,ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కోరుకుంటున్నారని విమర్శించారు.అమరావతిని రాజధానిగా చేస్తూ అసెంబ్లీ లో చేసిన తీర్మానం అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు.శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం,మండలిలో ఆమోదానికి పంపకపోవటం ప్రభుత్వం యొక్క దూకుడు స్వభావాన్ని తేటతెల్లం చేస్తుందని అక్షేపించారు. దీనిని పార్లమెంటులో ఆమోదించటం , ప్రత్యేక చట్టం చేయడం వంటి చర్యలు కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లుగా ఉందన్నారు. ఇప్పటికైనా అమరావతిలో రెండవ విడత భూ సేకరణ చేయాలని ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు . ఇది కేవలం ఆర్థిక దోపిడీకి అధికారంలో ఉన్న తండ్రీ,కొడుకుల స్కెచ్ గా ఆయన అభివర్ణించారు. జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణం వైసిపి ప్రభుత్వ హయంలోనే అన్ని అనుమతులు మంజూరు చేసి పోర్టు నిర్మాణానికి ఒక కొలిక్కి తీసుకువచ్చిన వైసీపీ సర్కార్ హయాంలో, రైతులు భూములు ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారన్నారు.పనులు సాఫిగా జరుగుతున్న తరుణంలో మంత్రులుగా ఉన్న బాబాయ్, అబ్బాయి లు ఆర్ధిక దోపిడీ కి పాల్పడేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అక్రమ పద్దతిలో దోపిడీ కి పాల్పడితే, రైతులు తరుపున వైసీపీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతుందని హెచ్చరించారు. గతంలో కాకరపల్లి ప్లాంట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తూ, బాధ్యత గల ప్రజా ప్రతినిధులు గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తదితరులు అడ్డుకున్న విషయాన్నీ గుర్తు చేశారు. ప్రచార ఆర్బాటాలు తప్ప, జిల్లా కు గానీ, జిల్లా అభివృద్ధికి గానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా మంత్రి అచ్చం నాయుడు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ఎప్పటికైనా డాంభికాలు మానుకొని, జిల్లా అభివృద్ధిలో బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు రాష్ట్ర వాలంటీర్ విభాగం కార్యదర్శి పైడి రాణా ప్రతాప్ రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి అల్లం శెట్టి ఉమా మహేశ్వరరావు జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి మెట్ట కృష్ణమరాజు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బడాన సునీల్ మాజీ ఎంపీటీసీ వైస్సార్ పార్టీ సీనియర్ నాయకులు గురుగుబెల్లి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :