DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా 4 వేల చేనేత కుటుంబాలకు మేలు కలిగే విధంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, సీనియర్ నాయకులు ఉమాపతి, ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ జిందే శారద కలిసి చేనేత కార్మికుల కుటుంబాలను స్వయంగా సందర్శించారు. వారి సమస్యలను తెలుసుకుని, ఉచిత విద్యుత్ పథకం ద్వారా వారికి కలిగే ప్రయోజనాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా చేనేత కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గి, వారి జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు. ఈ పథకం అమలుతో చేనేత రంగం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
DNB News