Monday, 02 November 2026 10:56:35 AM
# బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..?

రాష్ట్రంలో మొట్టమొదటి సోలార్ ప్రాజెక్ట్.. సమర్థ నిర్వహణతో జిల్లా ఆదర్శంగా నిలవాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.

Date : 08 May 2026 05:10 PM Views : 103

DNB News - ఆంధ్రప్రదేశ్ / : లాభంతో కూడిన వ్యాపారం సృష్టించుకొని మరొకరికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని, ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. శుక్రవారం ఎర్రుపాలెం మండలం, రాజుపాలెం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద నిర్మాణంలో ఉన్న ఒక మెగావాట్ సామర్థ్యపు సోలార్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. సౌర విద్యుత్ ప్లాంట్‌లో జరుగుతున్న నిర్మాణ పనులు, సాంకేతిక అంశాలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ప్రస్తుత పనుల పురోగతిని కలియతిరుగుతూ పరిశీలించారు. ఇంజనీర్స్, ప్లాంట్ నిర్మాణం, భవిష్యత్ విద్యుత్ సరఫరా అంశాలను జిల్లా కలెక్టర్ కు అధికారుల వివరించారు. ఖమ్మం జిల్లా మహిళ సమైక్య సభ్యురాలకు ఫ్లాంట్ నిర్వాహణ, ఆదాయం, వ్యయం, ఋణం తీర్చడం, పొదుపు, ఇతర మహిళాలకు ఉపాది అదాయం కల్పించడం పై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడంతో పాటు మహిళా సాధికారతకు బలమివ్వడం పథకం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చే త్వరలో ప్రారంభించుకొనే పవర్ ప్లాంట్‌కు అవసరమైన అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ప్లాంట్ నిర్వహణ ఎలా చేయాలనే దానిపై పూర్తి అవగాహన మహిళ సంఘాలకు కల్పించాలని సూచించారు. ప్రాజెక్ట్ పై ఉన్న భయాన్ని పోగొట్టి, నమ్మకం కలిగేట్టు శిక్షణ ఇవ్వాలన్నారు. మండల సమాఖ్యకు రోజువారీ నిర్వహణపై షెడ్యూల్ ఇవ్వాలన్నారు. రిజిష్టర్ల నిర్వహణ, రీడింగ్స్ నమోదు, ప్రతిరోజు చేపట్టాల్సిన పనులపై పూర్తి అవగాహన రావాలన్నారు. సమైక్యలకు ఆదాయ మార్గం ప్రత్యేక దృష్టి పెట్టి సోలార్ ప్యానెల్స్ శుభ్రంగా ఉంచాలని, అన్ని నిర్వహణ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రాజెక్ట్ ఖర్చులో బ్యాంక్ ఋణ సౌకర్యం కల్పిస్తూ ఇందులో సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుందని కలెక్టర్ అన్నారు. నాలుగు సంవత్సరాల వరకు లోన్ నిర్వహణ ఉంటుందని, బుణం తీరిన తర్వాత నుండి మహిళా సమైక్య సభ్యులకు ఆదాయం వస్తుందని తెలిపారు. చైతన్య మండలి మహిళా సమాఖ్యలు పదిమందికి ఉపాధి, ఆదాయం కల్పిస్తూ, నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనతరం ఎర్రుపాలెం మండల కేంద్రంలోని ఇందిరా మహిళా డెయిరి ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సందర్శించారు. పాల సేకరించే విధానం, నాణ్యత ప్రమాణాల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మహిళలకే పాడి పశువులు అందించి, పాల సేకరణ నుంచి ప్యాకింగ్, బై ప్రోడక్ట్ (వెన్నె, మజ్జిగ, పెరుగు, నెయ్యి, స్వీట్స్) ఉత్పత్తి, మార్కెటింగ్ చేసి లాభాలు పొంది మహిళలు పంచుకోనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా శక్తి యూనిట్ ల గ్రౌండింగ్ తో పాటు అవి విజయవంతంగా నడిచేందుకు అవసరమైన సహాయ, సహకారాలు, చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని, దీని కోసం మహిళలకు వ్యాపార దృక్పథం, అధికంగా లాభాలు ఎక్కడి నుంచి రాబట్టాలనే ఆలోచన సరళి రావాలని, తక్కువ రిస్క్ తో  వ్యాపారాలు ఎలా చేయాలి వంటి అంశాలు మహిళలకు నేర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో కొండపల్లి శ్రీరామ్, రెడ్కో డిస్ట్రిక్ట్ మేనేజర్ పి. అజయ్ కుమార్, డిఆర్డీవో ఎపిడి జయశ్రీ, ఏడిఏ విజయచందర్, ఎర్రుపాలెం తహసీల్దారు ఉషాశారద, ఏఎంసి చైర్మన్ బండారు నర్సింహారావు, సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, చైతన్య మహిళా సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :