DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్ రణస్థలం మండల కేంద్రం లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ ప్రేసిడెంట్ గా, మాజీ మంత్రి గా, మరీ ముఖ్యం గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ లకు అతీతంగా గౌరవం అందుకునే గౌరవ శ్రీ బొత్స సత్యనారాయణ ని అనుకరిస్తూ కిరాక్ ఆర్.పి. అనబడే జబర్దస్త్ స్టేజి నటుడు నిన్న మాట్లాడిన మాటలు హేయమని, సభ్యత సంస్కారం లేని మాటలు అని అన్నారు సత్తిబాబు కాలి గోటి కి కూడా సరిపడని ర్ పి పిచ్చిప్రెలాపణలు మానుకోకపోతే సత్తి బాబు అభిమానులమైన మేమే ఇంకెప్పుడు మాట్లాడకుండా నాలుక చీరుతామని హెచ్చరించారు, గౌరవ బొత్స సత్యనారాయణ గారు హుందా రాజకీయాలు చేస్తూ నేటి యువ నాయకులకు గురువు గా, మార్గదర్సకులు గా ఉన్నారని, ఈ ప్రాంత ప్రజల అభిమానం చూరగొన్న నాయకులు గా ప్రజాసేవ లో 30 ఏళ్ళు పైబడి ఉన్నారని స్థాయి మరచి మాట్లాడటమే కాకుండ వారి ఉచ్చారణ,ఈ ప్రాంత యాస ని యాగతాళి చేస్తే నీకు పళ్ళు ఉడపీకుతామని అన్నారు, రాజకీయ విమర్శ చేసేటప్పుడు హుందాగ నిర్మాణత్మాకంగా ఉండాలే కానీ వ్యక్తిగతం గా ఉండరాధని,ఇంకోసారి నీ పిచ్చి యాగతాళి మానుకోకపోతే రోజులు అన్ని ఒకేలా ఉండవని తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు, బొత్స సత్యనారాయణ అనుచరులు గా వారి అభిమానులు గా వారి నాయకత్వం లో పనిచేయడానికి మేము గర్వపడుతున్నామని అన్నారు.
Admin
DNB News