Saturday, 19 September 2026 10:29:25 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పాతపట్నం మాజీ ఎమ్మెల్యే... స్వర్గీయ చుక్కా పగడాలమ్మ మృతికి మాజీ సభాపతి సంతాపం

Date : 18 May 2026 04:23 PM Views : 135

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మెలియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే (1972–1978) స్వర్గీయ చుక్కా పగడాలమ్మ కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పరామర్శించారు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్వర్గీయ పగడాలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తమ్మినేని,ఆమె రాజకీయ జీవితం,ప్రజాసేవా తత్వం, నిరాడంబర వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు.పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ సేవా దృక్పథంతో రాజకీయాల్లో కొనసాగిన నాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజాసేవకు సాధనంగా భావించిన అరుదైన నాయకుల్లో చుక్కా పగడాలమ్మ ఒకరని తమ్మినేని సీతారాం అన్నారు.అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ,సామాన్య ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు.ప్రజా సేవే పరమావధిగా భావించి నిస్వార్థ రాజకీయాలకు ఆమె నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకులు ఆమె జీవన విధానం,సేవాభావం, తన జీవనశైలిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధిగా ఎదిగి, అనంతరం కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :