DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో కొందరు బంగారు వ్యాపారులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన దేవేంద్రప్ప మంగళవారం ఎమ్మెల్యే పీవీ పార్థసారథిని కలిశారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనల వివరాలను ఆయన ఎమ్మెల్యేకు వివరించారు. బంగారు వ్యాపారుల మోసాలకు తాము తీవ్రంగా నష్టపోయామని, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన స్పందన లేదని దేవేంద్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే పీవీ పార్థసారథి మాట్లాడుతూ అమాయక రైతులు, పేద ప్రజలను మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బాధితుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు
Admin
DNB News