Thursday, 17 September 2026 04:37:15 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు – ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు తీర్పు..

Date : 18 February 2026 11:22 AM Views : 148

DNB News - ఆంధ్రప్రదేశ్ / : హత్య కేసులో ముద్దాయి దేవదాసుకు జీవిత ఖైదు విధిస్తూ ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి P.J. సుధా తీర్పు వెలువరించారు. గోనెగండ్ల మండలం B. అగ్రహారం గ్రామానికి చెందిన హరిజన హంద్రీ దేవదాసు (37) గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన హరిజన లక్ష్మి (37)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేవాడు. అనంతరం ఆమెపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. 06.06.2021న బంధువుల పెళ్లికి వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి రాకపోవడంతో 13.06.2021న ఆమె తల్లి కిష్టమ్మ గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై Cr.No.184/2021 కింద మహిళ కనిపించడంలేదని కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కేసును 302 IPCగా మార్చారు. అప్పటి ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ CI మంజునాథ్ దర్యాప్తు చేపట్టారు. విచారణలో ముద్దాయి దేవదాసు లక్ష్మిని గుంతకల్లు చర్చికి వెళదామని మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి, కసాపురం సమీపంలోని పొలాల్లో గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం బైక్‌లోని పెట్రోల్‌తో శవాన్ని కాల్చి ఆనవాళ్లు చెరిపివేయాలని ప్రయత్నించినట్లు, ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు కసాపురం సమీపంలోని ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి పుర్రె మరియు ఇతర ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో DNA పరీక్షకు పంపగా అవి మృతురాలివేనని నిర్ధారణ అయింది. అలాగే మృతురాలు, ముద్దాయి ఫోన్ డేటాను విశ్లేషించారు. సమగ్ర ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం నేరం రుజువైనందున ముద్దాయికి జీవిత ఖైదు విధించారు. కేసును పక్కాగా నమోదు చేసి దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులను, సాక్షులను కోర్టులో హాజరు పరిచిన కోర్టు సిబ్బందిని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: