DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్ సమీపంలో ఫిలిప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కబడ్డీ సమ్మర్ ట్రైనింగ్ సెంటర్ మరియు కబడ్డీ కోర్టును నిన్న టిడిపి యువ నాయకులు కొంకా సిద్ధార్థ నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు ముందుకు రావాలని, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన యువకులకు ఇలాంటి శిక్షణా కేంద్రాలు మంచి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. ఉచితంగా నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా యువకులకు నైపుణ్యపూర్వక శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, క్రీడాభిమానులు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. కబడ్డీ సమ్మర్ క్యాంపు నిర్వహకులు అమర్ ప్రకాష్, భూపతి, నాగరాజ్, తాయన్న, నారాయణ, ఈరన్న, రాము, గోవిందు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News