DNB News - ఆంధ్రప్రదేశ్ / : మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన 125వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వర రావు యాదవ్, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రం సింగ్, పార్టీ ముఖ్య నాయకులు కె.వి.సుబ్బా రెడ్డి, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.వి.ప్రసాద్, రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి 58 రోజుల పాటు దీక్ష కొనసాగించారు. అనంతరం 1952 డిసెంబర్ 15న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైందని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేశారు.
Admin
DNB News