DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహ తెలిపారు. ఈ నెల 7వ తేదీన కర్నూలు 1 టౌన్ ఏరియా గడ్డ స్ట్రీట్ నివాసి షైక్ ఖలీల్ బాషా తన సంపత్ నగర్‌లోని కార్పెంటర్ షాపులో పని ముగించుకొని రాత్రి సమయంలో తన హీరో HF డీలక్స్ మోటార్ సైకిల్ (నెం. AP21 AU 6496)పై ఐరా హాస్పిటల్ నుంచి పాత ఈద్గా వైపు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి అతని వాహనానికి అడ్డుగా వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వనందుకు బాధితుడిని కొట్టి, అతని వద్ద ఉన్న రియల్ మీ స్మార్ట్ ఫోన్ మరియు మోటార్ సైకిల్‌ను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దొంగిలించబడిన మోటార్ సైకిల్ ఆచూకీని గుర్తించిన పోలీసులు, బంగారుపేటకు చెందిన నిందితుడు గిడ్డయ్యను కోడుమూరు రోడ్డులోని రిలయన్స్ మార్ట్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన మోటార్ సైకిల్ మరియు స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Admin
DNB News