DNB News - ఆంధ్రప్రదేశ్ / : మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం, అగసలదిన్నె గ్రామంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చూడి ఉలిగయ్య, తహసీల్దార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు రైతన్నల ప్రభుత్వం, రైతు పక్షాన నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని నేతలు స్పష్టం చేశారు. గత పాలకులు తమ రాజకీయ లబ్ధి కోసం అప్పటి సీఎం జగన్ తన ఫోటోతో పాస్బుక్‌లు ముద్రించారని, ఇది రైతుల కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని కాజేయడానికి చేసిన ప్రయత్నం కాదా అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయకత్వంలో రీసర్వే తప్పిదాల వల్ల భూ వివాదాల్లో చిక్కుకున్న రైతులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానం ద్వారా రైతులను మోసం చేశారని, రైతుల పట్ల చిత్తశుద్ధి లేని పాలన గతంలో కొనసాగిందని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ సభల ద్వారా రైతుల భూ హక్కులను పరిరక్షిస్తూ, పరిపాలనాపరమైన లోపాల వల్ల భూమిపై ఆధారపడి జీవించే అన్నదాతలు బాధ్యులు కాకూడదనే ఉద్దేశంతో మరి సర్వే చేపట్టి కొత్త పట్టాదారు పాస్బుక్‌లను పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ చర్యల ద్వారా రైతు కుటుంబాల్లో భరోసా, ఆశాభావం నింపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వల్లూరి పట్టాభి, లక్కే గోవిందు, చంద్రన్న శివ, మారెప్ప శివ, గ్రామ నాయకులు నాగరాజు గౌడ్, గోవిందప్ప, వీరేష్ నాయక్, నాగరాజు, హనుమంతు, వెంకటేష్, మారెప్ప, చెన్నబసవ, సుధాకర్ తదితర కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News