Saturday, 01 August 2026 10:36:56 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

విజయవాడలో క్లాత్ వేస్టేజ్ బ్యాగ్స్ ట్రైనింగ్ యూనిట్ పరిశీలించిన ఎమ్మెల్యే కూన *రవికుమార్

Date : 21 February 2026 03:25 PM Views : 128

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడలోని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లాత్ వేస్టేజ్ నుండి బ్యాగులు తయారు చేసే యూనిట్‌ను ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించి, వ్యర్థ వస్త్రాలను వినియోగించి పర్యావరణ హితమైన బ్యాగులు తయారు చేసే విధానంపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. అలాగే, ఆ యూనిట్‌లో మహిళలకు అందిస్తున్న శిక్షణ విధానం, తయారీ ప్రక్రియ, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళలకు తక్కువ పెట్టుబడితో, స్వయం ఉపాధి సాధించే అవకాశాలు ఈ యూనిట్ ద్వారా ఎలా కల్పిస్తున్నారో అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆముదాలవలస నియోజకవర్గంలో మహిళా సోదరీమణుల కోసం మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్లాత్ వేస్టేజ్ నుండి బ్యాగుల తయారీ యూనిట్‌ను ఆముదాలవలసలో ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల స్థానిక మహిళలకు ఉపాధి లభించడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సంబంధిత శాఖలతో చర్చించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి యూనిట్ స్థాపనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :