DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ , మైనారిటీ సంక్షేమ అధికారి సబిహ పర్వీన్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని పవిత్ర రంజాన్ మాసం ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో సౌహార్దం, ఐక్యత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నాయకులు తెలిపారు.
Admin
DNB News