Friday, 18 September 2026 05:07:56 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజల భద్రతకు భరోసా – కర్నూల్ ఎస్పీ ఆదేశాలు..

Date : 22 January 2026 11:41 AM Views : 134

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. వాహనాల తనిఖీలు: అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, నిషేధిత వస్తువులు, గంజాయి వంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. రహదారి భద్రత నిబంధనలు: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు సీటుబెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. నియమాల ఉల్లంఘనలపై చర్యలు: మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవని తెలిపారు. ప్రజలు భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :