Sunday, 02 August 2026 09:29:07 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

గత సైకో వైసీపీ ప్రభుత్వం లో రైతులు పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చి తో తన బొమ్మలతో వందల కోట్లు ప్రభుత్వ ధనం నాశనం చేశాడు

-- ఎమ్మెల్యే కూన రవికుమార్

Date : 03 February 2026 02:43 PM Views : 120

DNB News - ఆంధ్రప్రదేశ్ / : లోద్దల కాగితపల్లి గ్రామంలో భూమి యాజమాన్య హక్కుపత్రం– రాజ ముద్ర తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం లోద్దల కాగితపల్లి గ్రామంలో భూమి యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన రైతులకు భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతూ, రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. భూమి సంబంధిత సమస్యల వల్ల సంవత్సరాల తరబడి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు శాశ్వత పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. రైతు చేతిలో పాస్ పుస్తకం ఉంటే బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వoలో భూ సర్వే సరిగ్గా జరగకపోవడం వలన భూ వివాదాలు, రికార్డుల లోపాల వల్ల అనేక మంది రైతులు నష్టపోయారని, వాటిని సరిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భూమి హక్కులు కేవలం పత్రాలు కాదు – రైతుకు భరోసా, భవిష్యత్తుకు భద్రత అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ శివాల సూర్యం మండల అధ్యక్షులు అంబాలా రాంబాబు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కార్యకర్తలు,రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించినందుకు ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :