Saturday, 01 August 2026 10:36:53 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

సాంకేతికతతో నేరాల నియంత్రణ – ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్..

Date : 23 January 2026 11:44 AM Views : 112

DNB News - ఆంధ్రప్రదేశ్ / NTR DIST : నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, హత్యలు, ప్రాపర్టీ, చీటింగ్‌, రోడ్డు ప్రమాదాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేసుల పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజూ కనీసం రెండు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మమేకమవాలని ఆదేశించారు. సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సచివాలయ గ్రామ–వార్డు మహిళా పోలీసులతో సమన్వయంతో పని చేయాలని తెలిపారు. దొంగతనాలు, ప్రాపర్టీ కేసులు చేధించి రికవరీలు పెంచాలని, దర్యాప్తులను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. కేసుల దర్యాప్తులో నాట్ గ్రిడ్ సాంకేతికతను వినియోగించాలని సూచించారు. పోక్సో కేసుల్లో తప్పనిసరిగా 60 రోజులలోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, అలసత్వం వహిస్తే ఛార్జ్ మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిస్సింగ్, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ–ఎస్టీ, ప్రాపర్టీ కేసులపై సమీక్ష నిర్వహించి, కోర్టుల్లో పెండింగ్ కేసులు త్వరగా ట్రయల్‌కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పెంచి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. గత నెలలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య, దుర్గా ప్రసాద్, హేమలత, భార్గవి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :