Friday, 18 September 2026 06:26:01 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోనిలో MSME పార్క్ భూమి పూజ – యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబాటు..

Date : 25 May 2026 04:39 PM Views : 105

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం కపటి గ్రామానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేయనున్న MSME పార్క్ భూమి పూజ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి వాల్మీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక చర్యలు చేపడుతోందన్నారు. MSME పార్క్ ఏర్పాటు ద్వారా ఆదోని ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని, స్థానిక వ్యాపారవేత్తలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ పార్క్ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దిశ లభించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఆదోని నియోజకవర్గానికి రావడానికి మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. పరిశ్రమలు పెరిగితేనే యువతకు స్థిరమైన ఉపాధి, ప్రాంతానికి ఆర్థిక బలోపేతం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబురావు, విట్ట రమేష్ , కపటి మాధవ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: