DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన కోసం నిరంతరం పోరాడుతున్న జేఏసీ కమిటీకి ఆదోని డివిజన్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూ.25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు) చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంజీవరెడ్డి, ఆదోని డివిజన్ అధ్యక్షుడు శేశిరెడ్డి, ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి, ఆదోని తాలూకా అధ్యక్షుడు సంతెకూలురు ప్రతాపరెడ్డి, కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, కార్యదర్శి హరి రెడ్డి పాల్గొన్నారు. అలాగే బసాపురం గ్రామానికి చెందిన రెడ్డి బాంధవులు ధనుంజయ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదోని జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
Admin
DNB News