Friday, 18 September 2026 05:52:37 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర (దక్షిణ) ప్రధాన కార్యదర్శిగా వంకదారు శ్రీనాథ్ గుప్తా నియామకం..

Date : 22 March 2026 11:56 AM Views : 122

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) 2026-27 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (దక్షిణ విభాగం) ప్రధాన కార్యదర్శిగా ఆదోని పట్టణానికి చెందిన వంకదారు శ్రీనాథ్ గుప్తాను నియమిస్తూ వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ టంగుటూరి రామకృష్ణ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా సేవలందించిన శ్రీనాథ్ గుప్తా, సామాజిక సేవలో విశేషంగా గుర్తింపు పొందారు. ఉచిత మెడికల్ క్యాంపులు, చలివేంద్రాలు, స్వర్ణామృత ప్రాసన ఔషధ పంపిణీ వంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఆయనకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా దేశ, విదేశాలలో మరింత సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనను ఈ పదవికి ఎంపిక చేసిన వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ టంగుటూరి రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వామ్ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్‌కు నమస్కారాలు తెలియజేశారు. వామ్ నాయకులు శ్రీమతి జ్యోతి, శ్రీమతి జయశ్రీ, దిలీప్, సుబ్బరాజు, శ్రీమతి సూరా శ్రీదేవి తదితరులకు, అలాగే ఆదోని టీమ్ సభ్యులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పదవికి నియామకం పొందిన శ్రీనాథ్ గుప్తాకు పలు పట్టణాల ఆర్యవైశ్య సంఘాలు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :