DNB News - ఆంధ్రప్రదేశ్ / : అల్లూరి ఆశయాలు యువతకు స్ఫూర్తి : అడిషనల్ ఎస్పీలు.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో పునరంకితం కావాలని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన మహా వీరుడు అల్లూరి సీతారామరాజు అని, సాయుధ పోరాటం ద్వారానే స్వేచ్ఛ సాధ్యమని నమ్మి పోరాడిన ధీశాలి అని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మన్యం ప్రజలను ఏకం చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అల్లూరి చూపిన ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News