DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియా మరియు కొన్ని పత్రికల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దుష్ప్రచారమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) రాష్ట్ర కార్యదర్శి ఆలూరు నూర్ అహ్మద్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు కావాలనే పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు భయాందోళనలకు గురై అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని, దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు వేలాది లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫలితంగా సాధారణ ప్రజలకు ఇంధనం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా లభిస్తున్నదని పేర్కొంటూ, అసలు కొరత ఎక్కడా లేదని, ఇది పూర్తిగా ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి చెడ్డపేరు తెచ్చేందుకు చేస్తున్న కుట్రేనని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సోషల్ మీడియా వేదికలలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
Admin
DNB News