Wednesday, 16 September 2026 01:00:45 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పెట్రోల్ బాంబులతో దాడి అత్యంత దారుణం – రాష్ట్రంలో పూర్తిగా గాడి తప్పిన శాంతి భద్రతలు

Date : 02 February 2026 04:46 PM Views : 147

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై పోలీసుల కళ్ల ముందే రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో టీడీపీ గుండాలు దాడులు చేయడం అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలను పోలీసులు అడ్డుకోలేకపోవడం పోలీసుల చేతకానితనమా? లేక అధికార పార్టీకి దాసోహమా? అని ఆయన ప్రశ్నించారు. కొంతమంది అధికారుల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచక పాలన తప్పదని, ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా పోతే శాంతి భద్రతలే ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ఇలాంటి దౌర్జన్యాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అనుకుంటే అది వారి భ్రమ మాత్రమేనని స్పష్టం చేశారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు తలక్రిందులు అవుతాయని, నారా లోకేష్ దేశం విడిచిపోతారని, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ రోజు మీరు చేసిన ప్రతి చర్య డిజిటల్ బుక్‌లో రికార్డు అవుతుందని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కనీసం ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించాలని, ప్రధాని , కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఎర్రకోట రాజీవ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :