DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర 9వ మహాసభల పోస్టర్లను ఆదోని అంబేద్కర్ నగర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా హక్కుల పరిరక్షణ, స్త్రీ-పురుష సమానత్వం, మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మే 23, 24 తేదీలలో గుంటూరులో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. మని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ ఆదివాసీ ఉద్యమ నాయకురాలు సోనీ సోరీ మహాసభలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. “హిందుత్వం – మహిళలు” అంశంపై, అలాగే “నూతన న్యాయ చట్టాలు – మహిళా దృక్పథం” అనే అంశంపై ప్రముఖ న్యాయవాది జాహారా ప్రసంగించనున్నారని వివరించారు. మహాసభల సందర్భంగా ఏడు రకాల పుస్తకాలను మాతృక ప్రచురణలుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి, సమకాలీన అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఎంపికైన 200 మంది మహిళా ప్రతినిధులు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు, శ్రామిక మహిళలు పాల్గొన్నారు.
Admin
DNB News