Thursday, 17 September 2026 01:23:36 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

70 రోజులకు చేరిన దీక్షల సందర్భంగా ఐదు నియోజకవర్గాల్లో బంద్ విజయవంతం..

Date : 25 January 2026 10:41 AM Views : 151

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా 70 రోజులుగా కొనసాగుతున్న దీక్షల సందర్భంగా ఈ రోజు ఐదు నియోజకవర్గాల్లో నిర్వహించిన బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని విద్యార్థి సాధన జిల్లా జేఏసీ సెంట్రల్ కమిటీ కన్వీనర్ తిరుమలేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ఆదోని ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు అందాలంటే తప్పనిసరిగా ఆదోని జిల్లాగా ఏర్పడాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లా ఏర్పాటు అయితేనే ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు అయ్యే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఈ బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశాయని తెలిపారు. పార్టీ, కుల, మత భేదాలు లేకుండా ప్రజలంతా జిల్లా సాధన కోసం ఒక్కటై ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆదోని జిల్లా సాధన వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :