DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదు, అదే విధంగా అట్రాసిటీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం స్వాగతిస్తున్నది. అదేవిధంగా ఆర్టికల్ 341, 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను అమలు చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీ కులాల వారికి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్ ను రద్దుచేసి వారందరినీ బీసీసీ రిజర్వేషన్ కు చెందిన వారిగా గుర్తించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ కూడా ఎస్సి రిజర్వేషన్ ను రద్దు చేసుకోకుండా బీసీసీగా నమోదు చేసుకోకుండా అక్రమంగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్న వారందరిపై తక్షణమే వారి ఎస్సీ హోదా రద్దుచేసి అట్రాసిటీ కేసులు పెట్టాల్సిందిగా ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని ఏళ్ల నుండి దళిత క్రైస్తవ పేరుతో కొన్ని సంఘాలు ఏర్పడడం అదేవిధంగా దళిత క్రైస్తవుల పేరుతో సమావేశాలు పెట్టబడుతున్నాయి. ఇలాంటి సమావేశాలకు సంఘాలకు పూనుకుంటున్న వారందరిపై ఆయా సమావేశాలకు హాజరవుతున్న వారందరి పై చట్టప్రకారం విచారణ జరిపి అందులో ఎవరైతే ఎస్సీలుగా చలామణి అక్రమంగా అవుతున్నారో వారి యొక్క ఎస్సీ హోదా కూడా రద్దుచేసి వారందరిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం సమావేశం డిమాండ్ చేస్తున్నది. ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ అలాంటి వారికి ఎస్సీ హోదా రద్దు చేయబడి బీసీసీ గా గుర్తించబడతారని, రాజ్యాంగం స్పృష్టంగా చెప్పినప్పటికీ క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలను గుర్తించే విధానం అత్యంత లోపభూయిష్టంగా ఉండడం చేత మరోవైపు 1976 రాజ్యాంగం 42 వ సవరణ లో చేర్చబడిన సెక్యులర్ అనే పదం వల్ల కూడా ఈ మతం మారిన వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. గుర్తించాల్సిన అధికారులు సైతం సరైన నిర్ణయం తీసుకోలేక దొంగలకే తాళాలు అప్పజెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ సెక్యులర్ విధానంలో మత స్వేచ్ఛను కల్పించిన విధానంలో కొన్ని నూతన విధివిధానాలు చేయాల్సిన అవసరం ఉందని ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం సమావేశం భావిస్తున్నది. సెక్యులర్ విధానాన్ని అడ్డుపెట్టుకొని మతం మారినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్ ను పొందుతూ నిజమైన దళితులకు అన్యాయం చేస్తున్నారు. ఇంకా చట్టాల్లో ఈ లొసుగులు ఇలాగే కొనసాగితే యావత్ దేశంలో నిజమైన దళితులు మరింత అనగదొక్కబడి కిందికి దిగజారిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ దేశంలో ఎస్సీ కులాలు ఎస్సీ ఉపకులాల యొక్క చరిత్ర అద్భుతమైనది, అమోఘమైనది నాటి వ్యవస్థలో ఉన్న కొందరు దోపిడి దారుల వల్ల ఈ దేశంలో ఎస్సీ కులాలు అంటరానివిగా మారిన మాట వాస్తవం. కానీ హిందూ సనాతన ధర్మంలో ఎస్సీ కులాల ప్రజల ఆచార సంప్రదాయాలు చాలా గొప్పవి. తరతరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు అపజయాలు ఎదురైనప్పటికీ ఈ దేశానికి ఈ ధర్మానికి వెన్నుముకగా నిలబడిన వ్యవస్థ ఎస్సీ సామాజిక వర్గం. ఎస్సీ కులాలు లేని హిందూ సనాతన ధర్మం మనకు కనపడదు. ఎస్సీ కులాలు అంతరించిన నాడు ఈ దేశంలో సనాతన ధర్మం ఒంటి కాలుపై నిలబడక తప్పదు. ఇప్పటికే ఎస్సీలు అంటే క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఎస్సీలు అనే విధంగా తయారైన సమాజంలో గత కొంతకాలం నుండి నేటి ఆధునిక ఎస్సీ యువ నాయకత్వం ముందుకు వస్తుండడం ముఖ్యంగా జాతీయవాద సిద్ధాంతంతో పనిచేస్తుండడంతో అసలైన ఎస్సీలు అంటే ఎవరు క్రైస్తవులు అంటే ఎవరనే ఒక తేడా స్పష్టంగా సామాన్య ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్లిన ఒక కేసుకు సంబంధించిన విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా మతం మారిన ఎస్సీలకు ఎస్సీ హోదా మరియు అట్రాసిటీ హోదా వర్తించదని తీర్పు ఇవ్వడం జరిగింది. కాకపోతే మతం మారిన వారిని గుర్తించడంలో ఉన్న ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వారు ఈ దేశానికి ఒక విధి విధానం అందించాలని కోరుతున్నది ఈ ఎస్సి సంఘాల ఐక్య వేదిక. మతం మారిన వారు స్వయంగా ఒప్పుకుంటే తప్ప మతం మారినట్టు గుర్తించడం కష్టంగా మారింది. కాబట్టి నిజమైన దళితులను వారి హక్కులను ఆచార సంప్రదాయాలను రక్షించే క్రమంలో సెక్యులర్ మరియు మత స్వేచ్ఛ లాంటి చట్టాల్లో మార్పులు చేర్పులతో అందరికీ ఒకేలా కాకుండా ఎస్సీ రిజర్వేషన్ ను దృష్టిలో పెట్టుకుని నూతన విధానాలను రూపొందించాల్సిన అవసరం అత్యంత ఆవశ్యకమని ఈ ఎస్సీ హక్కుల పోరాట సంఘం సమావేశం వేదిక భావిస్తున్నది. ఈ కార్యక్రమం లో సభా అధ్యక్షులు దావు సంతోష్ కుమార్ ఎస్సీ పోరాట సంఘము రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ వంశ తిలక్ దొంతు మల్ల రాంబాబు లక్ష్మి నారాయణ లక్ష్మణ్ కన్నం శంకర్ మరియూ 100 మంది సంఘము సభ్యులు పాల్గొన్నారు.
Admin
DNB News