DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లాలో నూతన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఎమ్మెల్సీ బీటి నాయుడు, చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆదోని ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు, మంత్రాలయం ఇన్‌చార్జ్ రాఘవేందర్ రెడ్డి, ఆలూరు ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బుజ్జమ్మ, బొందిని కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింహ, జనరల్ సెక్రటరీ నాగరాజు యాదవ్ పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కైపు పద్మలత రెడ్డి, జేమ్స్, వాహిద్, ఉమాపతి నాయుడు, బత్తిన వెంకట్రాముడు, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, గుడిసె శ్రీరాములు, రామస్వామి మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు మరింత బలం చేకూర్చి, ప్రజలకు చేరువ కావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ మరింత శక్తివంతంగా ప్రజాసేవలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Admin
DNB News