Saturday, 01 August 2026 10:36:54 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

2026- 2027 చంద్రబాబు బడ్జెట్ – నకిలీ బడ్జెట్

Date : 18 February 2026 10:47 AM Views : 125

DNB News - ఆంధ్రప్రదేశ్ / : - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్ లు  అన్ని వర్గాల కోసం ఆమోద యోగ్యమైనవి . - కరోనా లాంటి క్లిష్ట పరిస్థితిల్లో ఆదాయ వనరులు తగ్గినా, జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయకుండా,ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేశారు. - ఈ కూటమి ప్రభుత్వం హయం లో ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది . కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత విషాదకరమైనది. - ఎన్నికలకు ముందు నోట్లో చక్కెర పోసినట్లు కబుర్లు చెప్పే చంద్రబాబు ఆ మాటలను నిలబెట్టుకోవడంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగే. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్ అన్నారు..తీరా చూస్తే బడ్జెట్లో కనీసం ఒక్క రూపాయి కూడా ఈ కూటమి ప్రభుత్వం కేటాయించలేదు. - అప్పులు చూపించరు, ఎనాలసిస్‌ చూపించరు. ఏదీ చూపించకుండా కలర్‌ కలర్‌ బొమ్మలు చూపిస్తూ అసత్యాలు చెబుతారా? అసలు మీ ప్రభుత్వం ఏర్పాటయ్యిందే సూపర్‌ సిక్స్‌ మీద. వాటి సంగతేంటి? నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000 అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ప్రజలకు ఆశ చూపించి మోసం చేసింది కాక, ఇంకా గత ప్రభుత్వం గాయం చేసింది అంటారా? - తల్లికి వందనం పథకానికి ఏడాదికి అయ్యే ఖర్చు 13,112.82 కోట్లు కానీ బడ్జెట్ లో ప్రవేశపెట్టింది 8457.07 కోట్లు. కోత 4,655.75 కోట్లు . ఇలా 3 బడ్జెట్ లో ఎగ్గొట్టింది 24, 504.39కోట్లు. - ఈ రాష్ట్రంలో 19 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న కోటి 85 లక్షలమంది మహిళలకు ఇప్పటికే ఆడబిడ్డ నిధి కింద రూ.97,200 కోట్లు బకాయి పడ్డారు. ఒక్కరికైనా నెలకు 1500 ఇచ్చారా? - ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు 3,000 ఇస్తామన్నారు. అంటే ఏటా రూ.7,200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి. మూడు బడ్జెట్‌లలో కలిపి 20 లక్షల మంది నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం రూ.21,600 కోట్లు బకాయి కానీ 3 బడ్జెట్ లో కనీసం ఆ ఊసే లేదు. - సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయించారు, అన్నధాత సుఖీభవా పథకానికి 5లక్షల నుండి 7 లక్షల అప్లికేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్నాయి. - జగన్మోహన్ రెడ్డి హయాంలో 54 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇస్తే, కూటమిపాలనలో అన్నదాత సుఖీభవ పేరుతో 47 లక్షల కుటుంబాలకు ఇచ్చి, 7 లక్షల కుటుంబాలకు మొండి చేయి చూపించి,అరాకొర బడ్జెట్ తో అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ 20000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో కేవలం రూ. 6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు... - నాడు -నేడు,ఉచిత పంటల భీమా, సున్నా వడ్డీ,తదితర పథకాలు గురించి  ఎక్కడ కూడా ఆలోచన చెయ్యలేదు - చంద్రబాబు బడ్జెట్ రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్ - చంద్రబాబు ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు,అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్ గా చూడాలి - ఈ బడ్జెట్ అభివృద్ధికి దర్పణం పట్టడం లేదు, చంద్రబాబు మోసాలకు, దారుణాలకు అద్దం పట్టేలా ఉంది, - ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడంతో పాటు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకు పోయే విధంగా, ఈ బడ్జెట్ ఉంది అని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) పలాస , ఇచ్చాపురం దుంపల రామారావు (లక్ష్మణ రావు). మీడియా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ బడ్జెట్ పై మండిపడ్డారు...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :