Sunday, 02 August 2026 10:30:46 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

జనగణన–2027 శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

Date : 02 March 2026 11:37 AM Views : 103

DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత ప్రభుత్వం చేపట్టనున్న జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహించనున్న గృహ జాబితా (House Listing) మరియు గృహ జనగణన కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు సంబంధించి జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం కర్నూలులోని జి. పుల్లయ్య ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు. గృహ జాబితా మరియు గృహ జనగణన కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం శిక్షణకు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డేటా నమోదు, సాంకేతిక సదుపాయాల వినియోగం, సిబ్బంది సామర్థ్యంపై ఆమె సమీక్ష నిర్వహించారు. సాంకేతిక లోపాలు లేకుండా శిక్షణ ప్రక్రియ కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా స్థాయిలో జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :