DNB News - ఆంధ్రప్రదేశ్ / : నషా ముక్త్ భారత్ కార్యక్రమం భాగంగా మత్తు పదార్థాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో వాకథాన్ నిర్వహించారు. రాజ్ విహార్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ఈ వాకథాన్‌లో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మత్తు పదార్థాలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని కూడా దెబ్బతీస్తాయని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించారు. మత్తు పదార్థాల వ్యసనాన్ని నిర్మూలించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని, ప్రభుత్వం చేపట్టిన “నషా ముక్త్ భారత్” కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల సహకారం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News