Friday, 18 September 2026 08:13:49 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పోర్టు పనులు పూర్తయ్యేలా పోరాటం సాగిద్దాం

Date : 22 March 2026 11:59 AM Views : 113

DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన మూలపేట పోర్టుపై చంద్రబాబు నాయుడు,కింజరాపు కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోర్టు పనులు పూర్తి అయ్యేవరకు పోరాటం సాగిద్దామని వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. శనివారం టెక్కలి పార్టీ కార్యాలయం ఆవరణలలో ఈనెల 30వ తేదీన జరగనున్న పోర్టు సందర్శించిన, బహిరంగ సభ కార్యక్రమం పై నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు,కార్యకర్తలతో మండల పార్టీ అధ్యక్షులు హనుమంతు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని తిలక్ మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పోర్టు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని అయితే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా తాత్సారం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, కింజరాపు అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడు లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అదనపు భూసేకరణ చేయాలని, పెత్తందారులకు భూములు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఈ ప్రాంత ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 30వ తేదీన జరగనున్న పోర్టు సందర్శన, బహిరంగ సభలో ఉత్తరాంధ్ర జిల్లాలలోని వైఎస్ఆర్సిపి నాయకులంతా హాజరవుతారని, గ్రామాల్లోని ప్రజలందరు పోర్టు దగ్గరకు తరలించి కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తిలక్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చల్ల రవికుమార్ మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గం లో తిలక్ నాయకత్వంలో అందరూ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి పాటుపడాలని, 30 తేదీ జరగనున్న పోర్టు పనులు పరిశీలన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ,మండల పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు,మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: