DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అశోక్ నగర్ పంప్ హౌస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల 600 ఎంఎం పైప్‌లైన్ మరమ్మత్తులకు గురికాగా, కేవలం 5 గంటల్లోనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్న అధికారులను కమిషనర్ అభినందించారు. అనంతరం నీటి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుంటూ నగరంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి లీకేజీలను వెంటనే గుర్తించి అరికట్టాలని అధికారులను ఆదేశించారు. స్కాడా వ్యవస్థ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతకుముందు 7వ శానిటేషన్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ ప్రాంతంలో మస్టర్‌ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ జనార్ధన్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News