DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నేరాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో భద్రతాభావం పెంపొందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై సత్వర స్పందన ఇవ్వడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని పేర్కొన్నారు. ప్రతి నెలా నేరాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించి కేసుల పురోగతిని పరిశీలించాలని, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సమన్వయంతో పనిచేసి నేరాలను అరికట్టాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు.
Admin
DNB News