Friday, 18 September 2026 03:23:07 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పార్టీ పునాదులు గ్రామాల్లోనే బలపడాలి.

Date : 21 January 2026 05:25 PM Views : 187

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కమిటీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా జె. కన్వెన్షన్ ప్రాంగణంలో అవగాహన సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్సా సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అతిరధ మహారధులు మాట్లాడుతూ.... ఒక మంచి భవనం నిలవాలంటే బలమైన పునాది ఎంత అవసరమో,అలాగే పార్టీకి గ్రామ స్థాయి కమిటీలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా, సరైన వ్యక్తికి సరైన బాధ్యత అప్పగిస్తూ కమిటీల నియామకాలు జరగాలని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ,వరి పంటకు సంబంధించిన కాలువలు,ఎరువుల కొరత, గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. నియంతృత్వ ధోరణిలో సాగుతున్న పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పార్టీ కార్యక్రమాల్లో ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇలా ఉద్యమాలు చేసేందుకు పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు అదే వ్యవస్థను తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని ఏద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని డబుల్ చేస్తామన్న కూటమి ప్రభుత్వం, ప్రజల సమస్యలను మాత్రమే డబుల్ చేసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చివరికి ప్రజలే అన్ని విషయాలను గమనించి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :