DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కార్యాలయంలో నూతనంగా ఉరుకుంద లక్ష్మీనరసింహ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియామకం పొందిన ఎండీ హళ్లి సర్పంచ్ శ్రీ గుమ్మరాల సుధాకర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ , కురువ సంఘం అధ్యక్షులు మళ్ళీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవేంద్రప్ప మాట్లాడుతూ సుధాకర్ కి శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని సూచించారు. తనకు ఈ పదవి దక్కడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సుధాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సి రెడ్డి, మంజు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News