Thursday, 17 September 2026 01:24:52 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన..

Date : 13 June 2026 10:15 AM Views : 143

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి, పరిశీలకులు రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షితో కలిసి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఫొటో గ్యాలరీని ప్రదర్శించారు. అనంతరం నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సహా అనేక హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మెగా డీఎస్సీ వంటి అంశాల్లో మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు అందిస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ నిధి’ హామీ ఏమైందని ప్రశ్నించిన ఆయన, రైతులు, మహిళలు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ రెండేళ్ల పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :