DNB News - ఆంధ్రప్రదేశ్ / : SFI, UTF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తరగతి మోడల్ ప్రజ్ఞా వికాసం పరీక్షలో పదవ తరగతి విద్యార్థులు తప్పకుండా పాల్గొని తమ ప్రతిభను కనబర్చాలని SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో పోటీ భావనను పెంపొందించడంతో పాటు పరీక్షలపై అవగాహన కల్పించడమే ఈ ప్రజ్ఞా వికాసం పరీక్ష ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆదోని డివిజన్ వ్యాప్తంగా ఈ మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పరీక్ష తేదీ: 09-02-2026 (సోమవారం) న మధ్యాహ్నం 2:00 గంటల నుండి 3:30 గంటల వరకు జరగనుందని తెలిపారు. మోడల్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తగిన బహుమతులు అందజేయబడతాయని వెల్లడించారు. అందువల్ల పదవ తరగతి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Admin
DNB News